జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » భద్రత మధ్య ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: పలువురి అరెస్టు! (Security | Arrest | Group-1 exams | Regional | Hyd | Telangana)
Bookmark and Share Feedback Print
 
రాష్ట్ర వ్యాప్తంగా 445 కేంద్రాల్లో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు భారీ భద్రత నడుమ ముగిశాయి. పోలీసు అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చేయడంలో సఫలమయ్యారు. జంట నగరాల్లోని 128 కేంద్రాల్లో భద్రతను అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షించాయి. ఒక్కో కేంద్రం వద్ద 20 నుంచి 50 మంది పోలీసులు పహారా కాశారు. అభ్యర్థులను, హాల్‌టిక్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయా కేంద్రాల్లోకి వారిని అనుమతించారు.

పరీక్షను అడ్డుకునేందుకు యత్నించిన పలువురు తెలంగాణవాదులను, విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ ఎంపీలు, తెరాస, తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లో గ్రూప్‌-1 పరీక్షా కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రయత్నిచడంతో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అక్కడ పోలీసులకు కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో పొన్నం ప్రభాకర్‌ పెదవికి స్వల్ప గాయమైంది. అలాగే, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణానికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్‌ ఎంపీలు, తెలంగాణ ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో ఎంపీ రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

సంగారెడ్డిలో తెరాస నేత హరీష్‌రావును, హైదరాబాద్‌లో నాయని నర్సింహారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగిన పలువురు విద్యార్థులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌లకు తరలించాయి. కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే, గట్టి భద్రత ఉన్నందువల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

ఇకపోతే.. తెలంగాణ జిల్లాల్లో అరెస్టు చేసిన ఐకాస నేతలను, విద్యార్థులను భేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. అలాగే, మంచిర్యాలలో ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, కావేటి సమ్మయ్యలను ముందుజాగ్రత్తగా గృహనిర్బంధంలో ఉంచారు. తెరాస నేతలు విజయరామారావు, ప్రభాకర్‌లను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.