జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను అరెస్టు చేయాలి: తేదేపా నేత గౌడ్ (TDP | APPSC | Regional | Devendar Goud | Telangana)
Bookmark and Share Feedback Print
 
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలను తుపాకీ నీడలో నిర్వహించడం సబబు కాదన్నారు. అసలు ఇలా నిర్వహించిన పరీక్షలు పరీక్షలే కావన్నారు. అందువల్ల వీటిని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన 42 శాతం వాటాను గ్రూప్-1 పోస్టుల్లో కేటాయించాల్సిందేనన్నారు. ఇది న్యాయ సమ్మతమైన డిమాండ్ అని అందువల్ల వాటాను కేటాయించడంలో తప్పులేదన్నారు.

పోలీసులు, కర్ఫ్యూ నీడలో పరీక్షలను నిర్వహించిన ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగి అరెస్టైన విద్యార్థులందరినీ భేషరతుగా విడుదల చేయాలని దేవేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.