జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అధిష్టానం ఏం చెప్పిందో తెలియదనే వారికి సెల్యూట్: డీఎస్ (D.Srinivas | PCC | Congress | Odaarpu | YS Jagan)
Bookmark and Share Feedback Print
 
ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం ఏం చెప్పిందో తమకు తెలియదని చెప్పే నేతలకు తాను సెల్యూట్ చేస్తానని పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ అన్నారు. నిజంగా అధిష్టానం చెప్పే ప్రతి మాటను అంత గోప్యంగా ఉంచుతున్నందుకు వారికి సలాం చేయాల్సిందేనన్నారు.

ఇక పార్టీలో ఎటువంటి అనుమానాలకు తావు లేదనీ, సమస్యలేమైనా ఉంటే తన దృష్టికి కానీ, లేదంటే ముఖ్యమంత్రి రోశయ్యగారి దృష్టికి గానీ తీసుకు రావచ్చన్నారు. అంతేతప్ప చిన్నచిన్న సమస్యలను పెద్దవి చేస్తూ పార్టీ ప్రతిష్టకు నష్టం వాటిల్లే రీతిలో ప్రవర్తించవద్దని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

అధిష్టానం మాటను ధిక్కరించి ఓదార్పు యాత్రను చేపట్టిన వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు చేపట్టదన్న మాటను ఎవరు చెప్పారో తనకైతే తెలియదని డీఎస్ అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.