వై.ఎస్. జగన్ కొత్త పార్టీలో చేరుతా..!: దామోదర్ రెడ్డి

SELVI.M|
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి పెట్టే కొత్త పార్టీ తెలంగాణకు అనుకూలమైతే ఆ పార్టీలో తాను చేరుతానని మాజీ మంత్రి దామోదరరెడ్డి అన్నారు. వై.ఎస్. జగన్ తెలంగాణకు కట్టుబడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండదని దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు.

రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న దామోదర్ రెడ్డి, తెలంగాణకు జగన్ పార్టీ అనుకూలమైతే అందరూ జగన్ వెంటే వెళతారని, తెలంగాణకు జగన్ అనుకూల ప్రకటన చేస్తే నేను కూడా జగన్ వెంటే వెళతానని ప్రకటించారు.

కాగా.. వై.ఎస్. జగన్మోహన రెడ్డి నూతన సంవత్సరంలో కొత్త పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉండాలా, వద్దా.. ఇంకా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కడప మాజీ ఎంపీ జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే వై.ఎస్. జగన్ పార్టీ విధివిధానాలు నచ్చితే ఆ పార్టీలో చేరుతానని మాజీ మంత్రి ప్రకటించిన సంగతి విదితమే.


దీనిపై మరింత చదవండి :