ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 20 నుంచి అనంతపురం ఓదార్పు: ఏర్పాట్లు పూర్తి! (Anantapuram | Odarpu tour | Karunakar Reddy | YSJagan | Regional)
20 నుంచి అనంతపురం ఓదార్పు: ఏర్పాట్లు పూర్తి!
ఈనెల 20వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 640 మంది చనిపోయారని గుర్తు చేశారు.
ఈ కుటుంబాలను జగన్ ఓదారుస్తారని చెప్పారు. ఈ యాత్రను ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో జగన్ పూర్తి చేశారన్నారు. తాజాగా ఈనెల 20వ తేదీ నుంచి ఈ యాత్ర అనంతపురంలో చేపడుతారు. 20వ తేదీ ఉదయం 10.15 గంటలకు కదిరి నియోజకవర్గంలోని నామాలగుండు నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారన్నారు. 29న శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించిన అనంతరం యాత్ర ముగుస్తుందన్నారు.
యాత్రలో 821 కి.మీ. ప్రయాణం చేసి 18 బాధిత కుటుంబాలను ఓదారుస్తారన్నారు. యాత్రలో 70 వై.ఎస్.ఆర్. విగ్రహాలను ఆవిష్కరిస్తాన్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో జగన్ ప్రసంగిస్తారన్నారన్నారు.