ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు బిచ్చగాడిలా చిరు!: అంబటి (Chiranjeevi | Congress | Tirupati | YSR Congress | PRP)
కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు బిచ్చగాడిలా చిరు!: అంబటి
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ఆయన పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు బిచ్చగాళ్లలా పదవుల కోసం నిలబడి నిరీక్షిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చిరంజీవితో పాటు పీఆర్పీ శాసనసభ్యులు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అంబటి డిమాండ్ చేశారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ ఉత్తిత్తి బాబేనని ఎద్దేవా చేశారు. బొత్సకు బీసీ రిజర్వేషన్లపై ప్రేమ లేదని విమర్శించారు. గుంటూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడిన అంబటి.. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తిరుపతిలోనే ప్రజారాజ్యం పార్టీ విలీన సభను పెడితే చిరంజీవిని ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు.
అలాగే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన చిరంజీవికి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని జగన్ వర్గం శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి సంతకాలు సేకరించడానికి చిరంజీవి వద్దకు ఎవరు వచ్చారో ఆయన బయట పెట్టాలని డిమాండ్ చేశారు.