జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | రౌండప్ 2010 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్: జగన్ (Jagan | YSR | Congress | Sonia | TDP | Odarpu tour | Andhrapradesh)
మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలకు, సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోమారు దుమ్మెత్తి పోశారు. కృష్ణా జిల్లాలో తన ఓదార్పు యాత్రను ఆయన ఆదివారం నుంచి ప్రారంభించిన విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు చీకటిలో స్నేహం చేస్తూ.. తనను ఇబ్బందుల పాలు చేసేందుకు కుట్ర పన్నాయని విమర్శించారు.

రాజకీయ నైతిక విలువలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందన్నారు.

తన తండ్రి పుణ్యమాని రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ వైఎస్ పట్లనే అన్యాయంగా నిందలు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం
దీన్ని కూడా శోధించు: జగన్, వైఎస్ఆర్, కాంగ్రెస్, సోనియా, తెదేపా, ఓదార్పు యాత్ర