జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెరాసకు మేం సీట్లు కేటాయిస్తే గెలుచుకున్నారు : బాబు (Telangana | tdp | trs | Chandrababu | Election | Liquor)
గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తాము టిక్కెట్లు కేటాయిస్తే ఆ పార్టీ గెలుచుకుదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీని ఎదుర్కొనే దమ్మూ సత్తా ఏ పార్టీకి లేదన్నారు. తెలంగాణ అంశంపై బహిరంగ చర్చకు రమ్మంటే ఏ ఒక్కరూ ముందుకు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇకపోతే దేశంలో పెరిగిపోతున్న అవినీతి ఉగ్రవాదం జాఢ్యం కంటే అత్యంత ప్రమాదకరమన్నారు. అందువల్ల అవినీతిని రూపుమాపడానికి సమర్థవంతమైన చట్టాలు రావాలని ఆయన కోరారు. అవినీతి రూపు మాపే ఉద్దేశం, చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు.

లోక్పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని చెప్పారు. సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఇష్టానుసారంగా ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అందుకే మద్యం అమ్మకాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia