సర్కారుకు ఉప ఎన్నికలు రెఫరెండం కాదు : సీఎం కేకేఆర్

ఆదివారం, 1 జనవరి 2012 (13:21 IST)

Widgets Magazine

తమ ప్రభుత్వానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలు రెఫరెండం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పని బాగానే ఉందన్నారు. అయినప్పటికీ.. ఈ ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్నారు.

వచ్చే 2014 ఎన్నికలు తమ సర్కార్ పనితీరుకు రెఫరెండంగా తాము భావిస్తామన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటికి దించుతుందన్నారు.

ఈ ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రచారానికి వెళతామన్నారు. 2014లో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా విలీనం కాలేదని వాస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి వర్గ స్థానంలో పీఆర్పీ వారికి స్థానం లభిస్తుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 400 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపారు. త్వరలో నామినేటేడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఈఆర్‌సీ ఆమోదం ప్రకారమే ఉంటుందని చెప్పారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్: ఎన్నిసార్లు దాడిచేసినా నో యూజ్!

హైదరాబాద్‌లో రేవ్ పార్టీల కల్చర్ సాగుతోంది. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేస్తున్నా, ఈ సంస్కృతి ...

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

లేటెస్ట్

శ్రీశైలం కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమే... మంత్రి కేటీఆర్ వ్యాఖ్య

శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్ ఉత్పత్తి కోసమేనని తెలంగాణ మంత్రి కెటీఆర్ అన్నారు. ...

5 విడతల్లో జమ్ము-కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు... ఈసీ

జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూలును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంపత్ శనివారంనాడు ప్రకటించారు. ఈ ...

Widgets Magazine