ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ ఆదేశంతో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు : శోభా (Jagan | Sobha Nagireddy | Kiran Kumar Reddy)
జగన్ ఆదేశంతో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు : శోభా
ఆదివారం, 1 జనవరి 2012( 14:16 IST )
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు.
ఆమె ఆదివారం ఆళ్ళగడ్డలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశం మేరకు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసినట్టు చెప్పారు. రైతు సంక్షేమం అవిశ్వాసం ప్రవేశపెట్టడం వల్ల తాము ఆ తరహా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అలాగే, తాము రైతుల కోసమే పదవులను త్యాగం చేశామన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్ ఎమ్మెల్యేలంతా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతారని చెప్పారు.