జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మద్యం అమ్మకాలతో వచ్చే సొమ్ముతో సంక్షేమమా : బాబు (Liquor Sales | Chandrababu | tdp | Krishna Dist)
విచ్చలవిడి మద్యం అమ్మకాలతో వచ్చే సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేయమని ఎవరు కోరుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో కల్తీ సారాకు 14 మంది ప్రాణాలు కోల్పోయి 24 గంటలు గడుస్తున్నా ఒక్క మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఒక్కరూ కూడా వెళ్లక పోవడం సిగ్గుచేటన్నారు.

ఆయన ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా మద్యం వ్యాపారాన్ని సమర్ధించుకుంటోందని దుయ్యబట్టారు. మద్యం నుంచి ప్రభుత్వానికి ఆదాయం రావాలని, మంత్రులకు కిక్ బాక్స్ రావాలని, అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

కృష్ణా జిల్లాలో జరిగిన కల్తీ సారా ఘటనతో ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. మద్యం సిండికేట్లపై తక్షణం ఏసీబీ నివేదిక బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల అక్రమాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న కల్తీ సారా ఘటనకు పూర్తిగా ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. అవినీతి ప్రభుత్వం చేతకానితనం వల్లే పేదలు కల్తీసారకు బలయ్యారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా కిరణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia