ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఈ యేడాది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెపుతారు : బండారు (Congress | Bandaru Dattatreya | Liquor Mafia | Jagan Team)
ఈ యేడాది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధిచెపుతారు : బండారు
ఆదివారం, 1 జనవరి 2012( 17:11 IST )
ఈ యేడాది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నేత బండారు దత్తాత్రేయ జోస్యం చెప్పారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మద్యం మాఫియా పాలిస్తోందన్నారు.
మద్యం సిండికేట్ల అక్రమాల్లో మంత్రులకు ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ తయారు చేసిన నివేదికను తక్షణం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, సిండికేట్ల వ్యవహారంలో సంబంధం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను తక్షణం మంత్రివర్గం నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇకపోతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు అసెంబ్లీలో విప్‌ను ధిక్కరించిన పరిస్థితి పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలిపారని ఆరోపించారు. అయినప్పటికీ.. వారిపై అనర్హత వేటు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.