ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » 2014 నాటికి సొంత గూటికి జగన్ : జేసీ దివాకర్ రెడ్డి జోస్యం (Jagan | jc Diwakar Reddy | Congress | Nominated Posts | Kiran)
2014 నాటికి సొంత గూటికి జగన్ : జేసీ దివాకర్ రెడ్డి జోస్యం
ఆదివారం, 1 జనవరి 2012( 17:30 IST )
వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్కు దూరమైన వారంతా తిరిగి సొంత గూటికి రావాల్సిందేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్తో పాటు.. పార్టీకి దూరమైనవారంతా తిరిగి సొంత గూటికి రాక తప్పదన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికలలోపు పార్టీని వీడిన వారు అందరూ స్వగృహానికి వస్తారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని దివాకర్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న జగన్ నిర్ణయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని సీఎం చెప్పడం శుభ పరిణామం అన్నారు.