జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » నాగర్‌కర్నూల్‌ ఉప పోరు : జనార్ధన్ రెడ్డి వర్సెస్ జనార్ధన్ రెడ్డి! (Chandrababu | tdp | by Poll | Nagam | Janardhan Reddy)
తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్ స్థానం ఒకటి. ఈ స్థానం తెదేపా మాజీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డికి కంచుకోటగా ఉంది. అయితే, ఆయన తెదేపా నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి కోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్వేషిణ మొదలుపెట్టి, చివరకు అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ అధినేత జనార్ధన్ రెడ్డిని ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇదే అంశంపై చంద్రబాబుతో జనార్ధన్ తాజాగా సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దిగే నాగం జనార్ధన్ రెడ్డిపై వస్త్ర వ్యాపారి జనార్ధన్ రెడ్డిని బరిలోకి దించడం ఖాయమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెదేపా శ్రేణులు చెపుతున్నప్పటికీ.. అధికారంగా ప్రకటించాల్సి ఉంది.

ఇకపోతే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మెట్టు వేణుగోపాల్ పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు శనివారం ప్రకటించాయి. గతంలో ఇక్కడ టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. కామారెడ్డిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ వైపు ఆ పార్టీ నాయకత్వం మొగ్గుచూపింది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia