జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం : ముగ్గురు యువకుల అరెస్టు (Ambedkar Statue | Amalapuram | East Godavari | Dist Police)
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంస రచన కేసులో ముగ్గురు యువకులను తూగో జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. 20 యేళ్ళ వయస్సున్న వీరు.. తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. అయితే, విగ్రహాల ధ్వంసానికి మూలకారకుడిగా భావిస్తున్న గంధం పల్లంరాజు మాత్రం పరారీలో ఉన్నాడు.

నాలుగు రోజుల క్రితం ఈ విగ్రహాల ధ్వంస రచన జరిగిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది. ఫలితంగా తూగో జిల్లా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

అనంతరం ఈ నిందితులు ధ్వంసం చేసిన విగ్రహాలను ఎక్కడెక్కడ పడవేసిందీ పోలీసులకు చూపించారు. స్థానిక వ్యవసాయ బావిలో పడేసిన విగ్రహాలను పోలీసులు బయటకు తీసి స్టేషన్కు తరలించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia