జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెనాలిలో ఎన్జీ రంగా- వంగవీటి మోహన విగ్రహాలు ధ్వంసం! (Ng Ranga | Vangaveeti Mohan Ranga | Statue | Guntur | Tenali)
అమలాపురం, భీమవరంలలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలను మరచిపోక ముందు గుంటూరు జిల్లా తెనాలిలో మరో ఆందోళనకర సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్‌లో ఆచార్య ఎన్‌.జి.రంగా విగ్రహాన్ని, కవిరాజు పార్కులోని వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శుక్రవారం అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

అయితే, ఈ విషయం బయటకు పొక్కితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన పోలీసులు రాత్రికిరాత్రే విగ్రహాలకు మరమ్మతులు చేయించారు. అలాగే, పట్ణణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా 144 సెక్షన్‌ విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి పట్టణంలో 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని స్థానిక డీఎస్పీ తులసీప్రసాద్ కోరారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia