ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్ ఓదార్పు యాత్రను గిన్నిస్ రికార్డులో చేర్చాలి: వీహెచ్ (Jagan | Odarpu Yatra | Guinness Record | v Hanumantha rao)
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రను గిన్నిస్ రికార్డులో చేర్చాలని వీహెచ్ ఎద్దేవా చేశారు. అధిష్టానం తనకు అనుమతిస్తే జగన్ అవినీతి గురించి రాష్ట్రంలో ఊరూరా ప్రచారం చేస్తానన్నారు.
జగన్‌కు ఏమైనా అయితే ప్రళయం వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అంటున్నారని, అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు మరణించినప్పుడు ఎలాంటి ప్రళయం రాలేదన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చార్మినార్‌ను కూడా వదిలిపెట్టడనని వీహెచ్ ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తనయుడు కూడా ఇంత డబ్బు సంపాదించలేదని చెప్పారు.