జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చర్చలకు పిలవకపోతే అత్యవసర సేవలు ఆపేస్తాం!: జూడాలు (Judos | Gandhi Hospital | State Government)
JuDoS
FILE
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారంతో నాలుగు రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి జూడాలు డెడ్‌లైన్ విధించారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రంలోగా చర్చలకు పిలవకపోతే అత్యవసర సేవల నిలిపి వేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.

ఇక జూడాలు చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరడంతో దీక్ష చేస్తున్న జూడాల షుగర్ లెవల్స్ పడిపోయాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను జూడాలు ఘోరావ్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో భారీగా పోలీసులను మోహరించారు. కాగా జీవనభృతి పెంపు, బోధనాస్పత్రుల్లో అధ్యాపకుల నియామకం, తదితర డిమాండ్లతో జూడాలు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
WebduniaWebdunia