జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రూ.700 కోట్ల ఫ్యాక్టరీని ఇప్పుడు నడపటం కష్టం: నాయుడు (Regency Institute | Vice President Chandra Sekhar | Chairman G.S.Naidu | dig Sukla)
రీజెన్సీ సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ నిర్మించిన రూ.700 కోట్విలువైన ఫ్యాక్టరీని ఇప్పుడు నడపటం కష్టం అని రీజెన్సీ సిరామిక్స్ ఛైర్మన్ జి.ఎస్. నాయుడు తెలిపారు. శుక్రవారం రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమలో జరిగిన లూటీలు, దహన కాండ ఘటనలలో చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని జి.ఎస్.నాయుడు కోరారు. ఇంకా రాజకీయ దురుద్దేశంతోనే దాడులు జరిగాయన్నారు.

శుక్రవారం రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమలో జరిగిన లూటీలు, దహన కాండ ఘటనలు అనంతరం యానాం ఇంచార్జి అడ్మినిస్ట్రేటర్ ఎం.వి సుబ్రమణ్యం బృందం జరిగిన నష్టం అంచనా వేసేందుకు ఇక్కడకు చేరుకున్నారు. రీజెన్సీ పరిశ్రమలో కాలిపోయిన వాహనాలు, రెగ్మా పరిశ్రమ, రీజెన్సీ విద్యా సంస్థలు, రీఎస్ నాయుడు కాలనీ ప్రాంతాలను వీరు పరిశీలించారు.

ఈ దాడి ఘటనలో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసినట్లు డీఐజీ శుక్లా తెలిపారు. ఈ ఆందోళనలో జరిగిన పలు సంఘటనలపై విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా యానాంలో 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని శుక్లా పేర్కొన్నారు.
WebduniaWebdunia