జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయం లేదు : కృష్ణరావు వెల్లడి (Amalapuram | Ambedkar | Statue | Investigation | Krishna rao)
ambedkar
File
FILE
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యం లేదని ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణాధికారి కృష్ణరావు తెలిపారు. దీనిపై ఆయన శనివారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విగ్రహాల విధ్వంసం కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.

మరో 13 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడి కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడని చెప్పారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ చేసిన వారంతా 20 యేళ్ల లోపువారేనని, తాగిన మైకంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia