జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » దాడుల వెనుక రాజకీయం .. సీబీఐతో విచారణ : జీఎన్.నాయుడు (Regency Ceramics | Yanam Attacks | gn Naidu | Puduchery)
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ కంపెనీపై జరిగిన దాడుల వెనుక రాజకీయ దురుద్దేశ్యం ఉందని అందువల్ల ఈ దాడుల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆ కంపెనీ ఛైర్మన్ జీఎన్.నాయుడు డిమాండ్ చేశారు. 700 కోట్ల రూపాయల విలువ చేసే ఫ్యాక్టరీ ఇపుడు తిరిగి ప్రారంభించలేని పరిస్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్త చేశారు.

దీనిపై ఆయన శనివారం మాట్లాడుతూ తమ కంపెనీపై జరిగిన దాడుల్లో ఖచ్చితంగా రాజకీయ నేతల హస్తముందని ఆరోపించారు. రూ.700 కోట్ల విలువ చేసే కంపెనీలో సుమారు రూ.600 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. అందువల్ల కంపెనీ పునరుద్ధరణపై ఇపుడేమీ చెప్పలేమన్నారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. కొందరు గుండాలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

తన మేనకోడలి భర్తను దారుణంగా చంపారని ఆయన ఆరోపించారు. తాను కార్మికులను బాగా చూసుకున్నానని ఆయన చెప్పారు. ఇపుడు 1200 మంది కార్మికుల భవిష్యత్, 2500 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదిన వ్యక్తం చేశారు.

కాగా, ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మృతి చెందిన సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు చంద్రశేఖర్ భౌతిక కాయానికి జీఎన్ నాయుడు నివాళులు అర్పించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia