ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం పదవి కోసమే తెలంగాణ ఉద్యమం: జేసీ దివాకర్ రెడ్డి (Jc Diwakar Reddy | Telangana | Kiran Kumar Reddy)
సీఎం పదవి కోసమే తెలంగాణ ఉద్యమం: జేసీ దివాకర్ రెడ్డి
శనివారం, 28 జనవరి 2012( 15:50 IST )
FILE
సీమాంధ్రులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం వస్తోందని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సీఎం పదవి కోసమే తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు.
మూడేళ్లు సీమాంధ్రులకు, రెండేళ్లు తెలంగాణ వారికి సీఎం పదవి ఇచ్చేటట్లు కొత్త చట్టం రూపొందించాలని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై జేసీ మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం చేయడం శోచనీయమని జేసీ అన్నారు. విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని తాను అనుకోవట్లేదని జేసీ వ్యాఖ్యానించారు.