ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ఎమ్మార్ కేసు : మాజీ సీఈవో విజయరాఘవన్ అరెస్టు (Emaar Case | Vijayaraghavan | Koneru Rangarao | Sunil Reddy | cbi)
ఎమ్మార్ కేసు : మాజీ సీఈవో విజయరాఘవన్ అరెస్టు
శనివారం, 28 జనవరి 2012( 16:08 IST )
File
FILE
ఎమ్మార్ విల్లాల కేటాయింపులులో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఆ సంస్థ మాజీ సీఈవో విజయరాఘవన్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయనను స్పెషల్ ఎకనామిక్స్ అఫెన్సెస్ కోర్టులో హజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశించింది.
కాగా, ఎమ్మార్ వ్యవహారం కేసులో సీబీఐ అరెస్టు చేసిన మూడో వ్యక్తి. ఈ కేసులో ఇప్పటికే కోనేరు రంగారావుతో పాటు వైఎస్ఆర్ బధువు సునీల్ రెడ్డిలను అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఎమ్మార్ కేసులో విజయరాఘవన్ వద్ద పలు దఫాలుగా విచారించిన సీబీఐ.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించింది. దీంతో ఎమ్మార్ కేసులో అరెస్టు చేసిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.