జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సాంకేతిక కారణాలతో పోలవరం టెండర్లు రద్దు : ప్రభుత్వం (Polavaram Tenders | Technical Reasoning | kcr | Lakshmi Rajam)
ap map
File
FILE
కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా పోలవరం టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే, కొత్త టెండర్లను త్వరలోనే ఆహ్వానించాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.

గత కొంతకాలంగా పోలవరం టెండర్లు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌‌ సిఫార్సు మేరకు ఆయన బంధువు, బినామీగా భావించే లక్ష్మీరాజంకు ఈ టెండర్లను కట్టబెట్టినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ పెద్ద దుమారమే రేపింది. దీంతో పోలవరం టెండర్లను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతూ ఈ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ టెండర్లను పొందిన ఎస్‌ఈడబ్ల్యూ కంపెనీకి ఎలాంటి అనుభవంలేదని గ్రహించిన ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia