జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విదేశాల్లో భోగాలు అనుభవిస్తూ ఉంటే సరిపోదు: పొన్నం (Ponnam Prabhakar | Congress | Chennamaneni Ramesh | Telangana)
Ponnam
File
FILE
తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‌ విదేశాల్లో భోగాలు అనుభవిస్తూ ఉంటే సమస్యలు పరిష్కారం కాదని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

ఇంకా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... శాసనసభ్యుడు జర్మనీలో ఉండి వినోదాలతో కాలం గడిపితే ప్రజల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఈ శివరాత్రికైనా రమేష్ తన నియోజకవర్గానికి వస్తారా అని ఆయన ప్రశ్నించారు. రమేష్‌పై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.

రమేష్ విదేశాల్లో భోగాలు అనుభవిస్తూ.. శాసనసభ్యుడై సొంత నియోజకవర్గంలోని కార్యక్రమాలకు కూడా రాకపోతే ఎలా అని పొన్నం ప్రభాకర్ అడిగారు. శాసనసభ్యుడికి అలవెన్సులు ఆపేయాలని తాను స్పీకర్‌ను కోరుతానని పొన్నం వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia