జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలుగుదేశం బూర్జువా పార్టీ: బీవీ రాఘవులు ధ్వజం (Bv Raghavulu | cpm | Telugudesam Party | Telangana)
Raghavulu
FILE
తెలుగుదేశం బూర్జువా పార్టీ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తాము తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని లేమన్నారు. ఎన్నికల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఎవరి జెండా వారిది అని తెలుగుదేశంతో పొత్తు గురించి మాట్లాడుతూ బీవీ రాఘవులు అన్నారు.

సీపీఐ కార్యాలయం ముఖ్దూం భవన్‌లో 11 వామపక్షాలు సమావేశమై ఐక్య కార్యాచరణపై చర్చలు జరిపాయి. ఈ సమావేశానికి అనంతరం బీవీ రాఘవులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వామపక్షాలతో కలిసి తాము ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు.

రాష్ట్ర విభజనపైనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దృష్టి పెట్టాయని ఆయన అన్నారు. పోలీసులతో కుమ్మక్కయి రీజెన్సీ సిరామిక్స్ యాజమాన్యమే యానాంలో కార్మిక నాయకుడిని చంపించిందని ఆయన ఆరోపించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia