ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం-ప్రతిపక్ష నేత రికార్డులను బ్రేక్ చేయలేరు : చంద్రబాబు (Chandrababu Naidu | Telugudesam | Congress | Chief Minister)
సీఎం-ప్రతిపక్ష నేత రికార్డులను బ్రేక్ చేయలేరు : చంద్రబాబు
శనివారం, 28 జనవరి 2012( 17:45 IST )
FILE
తన జీవితంలో ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా మద్యం ముట్టలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మద్యం సిండికేట్లపై మండిపడిన చంద్రబాబు, మద్యం అలవాటు కొద్దిగా ఉంటే ఫర్లేదని దానికే బానిస కాకూడదని హితవు పలికారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఒకటో రెండో పెగ్గులు తాగితే నష్టం లేదని, అదే కిక్కు ఎక్కువైతే జీవితం సర్వనాశనమవుతుందని గుర్తు చేశారు.
పేదల జీవితాలను మద్యం సిండికేట్లు నాశనం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా గాంధీ వర్ధంతి రోజున రెవెన్యూ డివిజన్ల స్థాయిలో తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు చూస్తుంటే పట్టరాని ఆవేశం వస్తోందని, ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు, ప్రతిపక్ష నేతగా ఏడేళ్లు పనిచేశానని తన రికార్డు బ్రేక్ చేయాలంటే ఎవరికైనా 20 ఏళ్లు పడుతుందన్నారు.