జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బిపి ఆచార్య అరెస్ట్: అధికారుల గుండెల్లో రైళ్లు (B.P Acharya | Amaar Case | Cbi | Andhrapradesh)
FILE
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి,హోంశాఖ ముఖ్యకార్యదర్శి బిపి ఆచార్యని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసిన నేపధ్యంలో కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగుడెతున్నాయి. ఎమ్మార్ లో అక్రమాలు పుట్టపగిలినా ఆచార్య గుడ్లప్పగించి చూస్తూ ఊరుకున్నారనీ, దీంతో ప్రభుత్వ బొక్కసానికి కోట్ల రూపాయల గండి పడిందని సీబీఐ అభియోగం.

కాగా ఆచార్య 2005 మే నెల నుంచి 2007 జూన్ వరకు ఎపిఐఐసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయనతోపాటు పనిచేసిన ఇతర అధికారులు, విల్లాలను అక్రమ మార్గంలో విక్రయించి ఆదాయాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని సీబీఐ వాదిస్తోంది.

ఎమ్మార్ కుంభకోణంలో నెం.1 సూత్రధారుడు ఆచార్యేనని అంటున్న సీబీఐ ఆయనపై అవినీతి నిరోధక చట్టం 13/1, 13/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీనితోపాటు ఐపిసి 120బి, 409, 420, 406, 477 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసింది. మొత్తమ్మీద బిపి ఆచార్య అరెస్టుతో ఎమ్మార్ కేసు చివరి దశకు చేరుకున్నట్లేనని చెప్పవచ్చు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia