ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అధికారం కోసం జగన్ పిచ్చోడిలా మారాడు : పాల్వాయి గోవర్ధన్ (Jagan, Palvaye Govardhan Reddy, Tdp, Congress, ysr)
అధికారం కోసం జగన్ పిచ్చోడిలా మారాడు : పాల్వాయి గోవర్ధన్
మంగళవారం, 31 జనవరి 2012( 10:49 IST )
File
FILE
తన తండ్రి వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం చేపట్టాలన్న తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... జగన్‌కు పిచ్చిముదరడం వల్లే కాంగ్రెస్ పార్టీపైనా, కాంగ్రెస్ ప్రభుత్వం పైనా తన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అందువల్ల జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మాత్రం తాము విఫలమైనట్టు పాల్వాయి అంగీకకరించారు. ఇటీవల జగన్‌పైనా కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల జోరు తగ్గించినట్టు వస్తున్న వార్తలపై ఆయన ఇలా స్పందించారు.
కాగా జగన్ తన ఓదార్పు యాత్రలో మళ్లీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఇటీవల గుంటూరులో కాంగ్రెస్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ కలిసి తనపై కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ఇలా రోజుకో విధంగా జగన్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.