ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సీఎం క్యాంపు కార్యాలయ : తెదేపా నేత దాడికి అవమానం! (Tdp | Dadi Veerabhadra rao | cm Camp Office | Hyderabad)
సీఎం క్యాంపు కార్యాలయ : తెదేపా నేత దాడికి అవమానం!
మంగళవారం, 31 జనవరి 2012( 10:57 IST )
File
FILE
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద అవమానం జరిగింది. ఒక ఎమ్మెల్సీ అయినప్పటికీ.. ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అవమానానికి గురైన ఆయన అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
జూనియర్ డాక్టర్ల సమస్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు ఆయన వెళ్లారు. అయితే, వాహనాన్ని సీఎం భద్రతా సిబ్బంది క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లనీయంకుండా అడ్డుకుంది.
అదేసమయంలో ప్రముఖ నిర్మాత రామానాయుడుకు సీఎంను కలిసేందుకు లోనికి వెళ్లారని అందువల్ల మీరు వెళ్లేందుకు వీలు లేదని దాడికి భద్రతా సిబ్బందికి చెప్పినా వినిపించుకోలేదు. దీంతో భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినతిపత్రం సమర్పించకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.