ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » రీజెన్సీ వైస్ ఛైర్మన్ హత్య కేసులో నిందితుల గుర్తింపు : డీఐజీ (Yanam | Vice Chairman | Regency Ceramics | Police)
రీజెన్సీ వైస్ ఛైర్మన్ హత్య కేసులో నిందితుల గుర్తింపు : డీఐజీ
మంగళవారం, 31 జనవరి 2012( 11:02 IST )
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ కంపెనీల వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ మృతి కేసును హత్యా కేసుగా నమోదు చేసినట్టు డీఐజీ శుక్రలా తెలిపారు. అంతేకాకుండా, ఈ కేసులో నిందితులను ఇప్పటికే గుర్తించామని ఏక్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసినట్టు చెప్పారు. అందువల్ల ఈ కేసులోని నిందితులు స్వయంగా పోలీసులకు లేదా కోర్టులో అయినా లొంగిపోవచ్చన్నారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.