ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సూట్‌కేసులతో వస్తే లోనికి అనుమతిస్తారా : దాడి వీరభద్రరావు (Dadi Veerabhadra rao | tdp | cm Kiran | cm Camp Office)
సూట్‌కేసులతో వస్తే లోనికి అనుమతిస్తారా : దాడి వీరభద్రరావు
మంగళవారం, 31 జనవరి 2012( 12:22 IST )
File
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోని సూట్‌కేసులతో వస్తే అనుమతిస్తారా అంటూ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ విపక్షనేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. మంగళవారం ఉదయం జానియర్ డాక్టర్ల వ్యవహారంపై వినతి పత్రం ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి దాడి వెళ్లారు. ఆ సమయంలో సీఎం క్యాంపు కార్యాలయ సిబ్బంది దాడి వాహనంతో పాటు.. ఆయనను కూడాలోనికి వెళ్లనీయలేదు. పెద్దల సభలో విపక్ష నేతగా ఉన్న దాడి.. సీఎం క్యాంపు కార్యాలయంలోకి వాహనంతోనే వెళ్లే వెసులుబాటు ఉన్నా భద్రతా సిబ్బంది మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత డి రామానాయుడు సీఎంతో సమావేశమై ఉన్నందువల్ల దాడిని లోనికి అనుమతించలేదని వాదిస్తున్నారు.
మరోవైపు... ఈ సంఘటనపై దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ తన పట్ల భద్రత సిబ్బంది అనుసరించిన తీరు పెద్దల సభకే అవమానంగా పేర్కొన్నారు. దీనికి నిరసనగా శాసనమండలి సమావేశాలు ప్రారంభంరోజునుంచే సభలోనే నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలోనే బాంబులు, సూట్‌కేసులతో వస్తేనే అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం పేషీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే సీఎం దుహంకారిగా తాము అభివర్ణిస్తున్నట్టు దాడి పేర్కొన్నారు.