సీబీఐ థర్డ్ డిగ్రీకి పాల్పడుతోందనీ, అరెస్టు చేసిన వారి నుంచి నిజాలు రాబట్టేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని సోమవారం మీడియాలో కథనాలు రావడంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు.
తామెవరిపైనా థర్డ్ డిగ్రీ చర్యలు తీసుకోవడం లేదనీ, అదేవిధంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ విచారణలను కూడా జరపడం లేదని చెప్పారు. నేరం పాల్పడినట్లు అభియోగాలు నమోదైనవారిపై విచారణ జరపడమే తమ విధి అని అన్నారు.
మీడియా వారు సీబీఐ విచారణ గురించి ఏదైనా రాసేటట్లయితే నిజం తెలుసుకుని రాయాలని సూచించారు. అంతేతప్ప ఏవో ఊహాగానాలు రాయవద్దని హితవు పలికారు. ఏదైనా జరిగితే తామే ప్రస్ నోట్ ద్వారానో, ఎస్ఎమ్ఎస్ ద్వారానో తెలియజేస్తామని వెల్లడించారు.