ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » తెలంగాణ కోసం బాబు ఇంటివద్ద ధర్నా చేయండి : కిషన్‌రెడ్డి (Telangana | Chandrababu | Kishan Reddy | bjp | tdp)
తెలంగాణ కోసం బాబు ఇంటివద్ద ధర్నా చేయండి : కిషన్‌రెడ్డి
మంగళవారం, 31 జనవరి 2012( 13:08 IST )
File
FILE
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ధర్నా చేయాలని టి ఉద్యమకారులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ సాధన కోసం ఆ పార్టీ రాష్ట్ర శాఖ చేపట్టిన పోరుయాత్ర మంగళవారం కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే ప్రధాన అడ్డంకి అని ఆయన చెప్పారు.
అందువల్ల తెలంగాణ కోసం చంద్రబాబు ఇంటి ఎదుట ధర్నా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. అందువల్ల ఈ ప్రాంత పర్యటనకు వచ్చే బాబును నిలదీయాలన్నారు.
ఇకపోతే రాష్ట్రంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రి రైతు సమస్యలపై ప్రధానితో ఎదుకు చర్చించరని ఆయన నిలదీశారు.