జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అధికారంలోకి వచ్చిన ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తా : జగన్ హామీ (Jagan | ysr Congress | jr Doctors | Fasting | Gandhi Hospital)
ys jagan
File
FILE
తమ డిమాండ్ల పరిష్కార సాధన కోసం గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంఘీభావం ప్రకటించారు. ఇందుకోసం ఆయన జూడాలు దీక్ష చేస్తున్న గాంధీ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న జూడాలనుద్దేశించి ప్రసంగిస్తూ... జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవేనన్నారు. ముఖ్యంగా.. వారు డిమాండ్ చేస్తున్న స్టెయిఫండ్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉందని అందువల్ల జూడాల డిమాండ్‌ను పరిష్కరించాలని ఆయన కోరారు.

అంతేకాకుండా, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజున ఐదు నిమిషాల్లో జూనియర్ వైద్యుల సమస్యలు, డిమాండ్లను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జగన్ వారికి హామీ ఇచ్చారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia