జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » విజయమ్మ లేఖలోని ఆరోపణల్లో నిజంలేదు : మంత్రి శైలజానాథ్ (Ys.Vijayamma | Ys.Sailajanadth | Jagan | Congress Party | Manmohan Singh)
Sailajanadth
File
FILE
దివంగత మహానేత వైఎస్ఆర్ కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేసేందుకే సీబీఐ దర్యాప్తు జరిపిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్లో ఒక్కటి కూడా నిజం లేదని రాష్ట్ర ప్రాథమిక శాఖామంత్రి ఎస్.శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

దీనిపై ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... సిబీఐ విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నట్టు విజయమ్మ ఆరోపించడం సరికాదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్ పాత్ర లేదని ఇదే సీబీఐ నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు.

ఇపుడు సీబీఐ దర్యాప్తు వారికి అనుకూలంగా లేకపోవడంతో దర్యాప్తు సంస్థపై నిందలు వేయడం భావ్యం కాదన్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని మంత్రి శైలజానాథ్ విమర్శించారు. ఇంకా సీబీఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తుందన్నదానిపై ఆయన స్పందిస్తూ... సీబీఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా జైలుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia