జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బిపి ఆచార్యకు గుండెనొప్పి: నిమ్స్‌కు తరలింపు (Bp Acharya | Heart Attack | Nims)
ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడైన బిపి ఆచార్యకు గుండెనొప్పి వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ కార్డియాలజిస్టు శేషగిరిరావు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా బిపి ఆచార్య ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఐతే సీబీఐ అధికారులు మాత్రం ఆచార్య ఆరోగ్యం విషయంపై నోరు మెదపడం లేదు. ఈ రోజు ఉదయం ఆచార్య భార్య ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. అలా మాట్లాడుతున్న సమయంలోనే ఆచార్యకు గుండెనొప్పి వచ్చింది. దీంతో మధ్యాహ్నం ఆయనను ఆసుపత్రిలో చేర్చి ఫర్వాలేదన్న తర్వాత తిరిగి దిల్ కుషా హౌస్‌కు తరలించారు. అయితే సాయంత్రం మళ్లీ రావడంతో నిమ్స్ కు తరలించి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia