ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జూడాలు రూ.5 వేలు కోసం పోరాడుతుంటే మంత్రులకు రూ.2 లక్షలా (Jr Doctors | ap Ministers | Salaries)
జూడాలు రూ.5 వేలు కోసం పోరాడుతుంటే మంత్రులకు రూ.2 లక్షలా
మంగళవారం, 31 జనవరి 2012( 21:59 IST )
FILE
జూనియర్ డాక్టర్ల దీక్ష ఉధృత రూపం దాల్చుతోంది. రేపు ఛలో హైదరాబాదుకు సిద్ధమవుతున్నారు. వారు డిమాండ్ చేస్తున్నది రూ. 5 వేల స్టైఫండ్. ఈ మొత్తాన్ని పెంచడంపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
అదేసమయంలో మంత్రులు తమ జీతభత్యాలను ఎకాఎకిన రూ.2.15 లక్షలకు పెంచుకుని రెట్టింపు చేసుకున్నారని మండిపడుతున్నాయి. ప్రాణాలు నిలబెడుతున్న వైద్యులకు రూ. 5 వేలు ఇమ్మంటే చేతులు రాని సర్కారుకు మంత్రుల జీతాలను 2 లక్షలకు ఎలా పెంచుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.
తమ ఇష్టం వచ్చినట్లు జీతాలు పెంచుకుంటూ వెళుతున్న మంత్రుల కళ్లకు జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష కనబడటం లేదా.. అంటూ ధ్వజమెత్తారు. కాగా మంత్రుల జీతంలో బేసిక్ పే రూ. 5 వేల నుంచి రూ. 12 వేలకు పెరిగింది. ఇక మొబైల్ ఫోన్లకు రూ. 35 వేలు, ఒక్కో మంత్రికి ముగ్గురు అటెండర్లు నియమించుకునే అవకాశం.. ఇలా వెరసి ఏటా రూ. 5.5 కోట్ల రూపాయలు మంత్రుల జీతాల రూపంలో ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.