జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అభ్యర్థుల ఖరారుతో ఊపందుకున్న ఉప ఎన్నికల వేడి!! (Candidates | by Poll | Congress | Telangana | Kovure | tdp | trs)
telangana
File
FILE
రాష్ట్రంలో ఉప ఎన్నిక వేడి ఊపందుకుంది. తెలంగాణలో ఆరు, కోస్తాంధ్రలో ఒక అసెంబ్లీ స్థానానికి కలిపి వచ్చే నెల 18వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో ఉప ఎన్నికల సందడి ఆరంభమైంది.

ఇప్పటికే అధికార కాంగ్రెస్‌పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, తెలంగాణ రాష్ట్ర సమితి ఐదుచోట్ల పోటీ చేయనుంది. సీపీఎం ఇప్పటి వరకూ మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఈ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందంజలోనే ఉంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను సైతం నియమించింది. ఒకటికన్నా ఎక్కువ స్థానాలున్న చోట జిల్లా ఇన్‌ఛార్జిమంత్రి, ఇతర మంత్రులకు బాధ్యతలు చూస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఏడు నియోజకవర్గాల్లో రోజుకొకటి చొప్పున ఒక్కో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కిరణ్‌, పిసిసి అధ్యక్షుడు బొత్స పర్యటిస్తారని, నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు కూడా నిర్వహిస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా కింది వారిని నియమించింది. కామారెడ్డికి మంత్రులు సుదర్శన్‌ రెడ్డి, కోవూరుకు మంత్రి ఆనం రామానారాయణరెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌‌కు మంత్ర పొన్నాల లక్ష్మయ్య, కొల్లాపూర్‌‌కు మంత్రి డికె అరుణ, అదిలాబాద్‌‌కు మంత్రి సారయ్య, నాగర్‌ కర్నూల్‌‌కు రాంరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్‌‌కు మంత్రి శ్రీధర్‌భాబులను నియమించారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia