చంద్రబాబు ఒక్కరే నీతిమంతుడనుకుంటే ఎలా.!: బొత్స

Botsa
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కరే నీతిమంతుడనుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి వైఖరితోనే తెలంగాణ అంశం మరింత జాప్యం అవుతోందని బొత్స ఆరోపించారు. కేసులను ఎదుర్కోలేకనే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని బొత్స ఎద్దేవా చేశారు.

రైతు సమస్యలపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని బొత్స ప్రశ్నించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు వేస్తామని, గెలుపోటములకు జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధం లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమిలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని బొత్స చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలనే.. ఉపఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ప్రయోగిస్తామని బొత్స తెలిపారు.

శుక్రవారం బొత్స ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ పనితీరు, అభివృద్ధిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులా నబీ ఆజాద్కు వివరించినట్లు బొత్స తెలిపారు. ఉప ఎన్నికల అభ్యర్థులకు బీఫారాలు శనివారం అందచేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలసికట్టుగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నారు.

తెలంగాణతో సహా ఇతర సమస్యలకు కాంగ్రెస్ మాత్రమే శాశ్వత పరిష్కారం చూపగలదన్న నినాదంతో ప్రజల్లోకి వెళతామని బొత్స అన్నారు. కాంగ్రెస్కు వ్యక్తులు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే ముఖ్యమన్నారు. తెలంగాణ అంశంపై తెదేపా గంటకో మాట చెప్తోందని బొత్స వెల్లడించారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

తెలుగు వార్తలు

మోడీకి లీ హసిన్ లూంగ్ అభివనందలు.. ఆహ్వానం!

దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించనున్న నరేంద్ర ...

ఆ ప్రశంస మోడీ గొప్పతనానికి నిదర్శనం : పవన్ కళ్యాణ్

సమైక్యాంధ్ర ఎన్నికల ప్రచారంలో తన వంతు సాయం అందించినందుకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

చాయ్ వాలా వృత్తిని అవమానించిన మోడీ : మణిశంకర్

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చాయ్ వాలా వృత్తిని చాలా అవమానించారని కాంగ్రెస్ ...

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా నేతగా తనను తమ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారని, అందువల్ల తనను ...

Widgets Magazine

 

Widgets Magazine

ఎడిటోరియల్స్

కాంగ్రెస్ పార్టీలో ముసలం... హస్తం ఏమవుతుందో...?

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రులపై మంత్రులు ...

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అర్హమైన నగరం అదే...!

రాజధాని... రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, అభివృద్ధి కార్యకలాపాలకు గుండెకాయ. అది దేశానికైనా, ...

లేటెస్ట్

కమల్‌నాథన్ కమిటీ భేటీ ఓవర్: 2 రోజుల్లో వెబ్‌సైట్లో విధివిధానాలు!

ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ భేటీలో ...

సడెన్ గా పట్టాలపైకి బస్సు... ఢీకొనగానే పెద్దగా ఏడ్చేశా... రైలు డ్రైవర్

సడెన్ గా పట్టాలపైకి స్కూలు బస్సు. కంట్రోల్ చేసేందుకు సడెన్ బ్రేక్ వేసేటప్పటికే జరగాల్సిందంతా ...