జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » అక్రమాస్తుల కేసు.. కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పని జగన్ (Jagan Assets Case | Cbi | Vanpic | Nimmagadda)
WD
జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తోంది. సుమారు 5 గంటల నుంచి జగన్‌కు సీబీఐ ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా వాన్‌పిక్ భూ కేటాయింపుల సమయంలో సాక్షిలోకి వరదలా వచ్చిన నిధులు ఎలా వచ్చాయి.. ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైన ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా 2004లో కేవలం లక్షల్లోనే ఆదాయపు పన్ను చెల్లించి.. 2009 వచ్చే నాటికి 80 కోట్ల రూపాయలకు పైగా కట్టగలిగిన ఆదాయం ఏ విధంగా వచ్చిందంటూ ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు సమాచారం.

సీబీఐ అడిగిన ఇటువంటి కీలక ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పలేదని సమాచారం. దీంతో ఇవే ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రాకపోయినట్లయితే మరో రోజు జగన్‌ను విచారించాలనుకుంటున్నట్లు సమాచారం.
సంబంధిత సమాచారం
Feedback Print