ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » కాంగ్రెస్‌కు వేయకుంటే ఓటు మురిగిపోయినట్టే : రాయపాటి (Rayapati Sambasiva rao | Congress | by Poll | Jagan | Mopidevi)
కాంగ్రెస్‌కు వేయకుంటే ఓటు మురిగిపోయినట్టే : రాయపాటి
శనివారం, 26 మే 2012( 17:54 IST )
File
FILE
వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టేనని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఓటర్లు విజ్ఞతతో ఆలోచన చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టుతో పత్తిపాడు, మాచర్ల ఉప ఎన్నికలకు ఇంచార్జీ నియామకంపై ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోపిదేవి అరెస్టు దురదృష్టకరమన్నారు.
మోపిదేవి ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి బయటపడి నిర్దోషిగా బయటపడతాడని చెప్పారు. ఇకపోతే.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తప్ప ఎవరికి ఓటు వేసినా నిప్పుల్లో పోసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.