ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » లక్ష్మీపేట దళితులకు అండగా ఉంటాం : విజయమ్మ (Lakshmipet Dalit | Vijayamma | Ysrcp | Srikakulam)
లక్ష్మీపేట దళితులకు అండగా ఉంటాం : విజయమ్మ
శనివారం, 16 జూన్ 2012( 16:12 IST )
File
FILE
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ముంపు మినహా మిగులు భూముల వివాదంపై ఈనెల 12న జరిగిన కోట్లాటలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఘటనకు దారి తీసిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఊచకోతకు గురైన దళిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు. అలాగే, ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, వైఎస్ విజయలక్ష్మి వెంట ఆమె కుమార్తె షర్మిల, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. లక్ష్మీపేట ఘటనలో నలుగురు దళితులు మృతిచెందగా, 31 మంది గాయపడిన సంగతి తెలిసిందే.