జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » మహికో పత్తి విత్తనాల కోసం ఎగబడుతున్నారు.. అందుకే: మంత్రి కన్నా (Cotton Seeds Shoratage | Minister Kanna | Andhra Pradesh)
FILE
మహికో కంపెనీకి చెందిన విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నందువల్లనే కొరత ఏర్పడిందని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రైతులు ఈ కంపెనీ విత్తనాల కోసమే ఎందుకు ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

మహబూబ్ నగర్ జిల్లాకు 7 లక్షల ప్యాకెట్ల విత్తనాలను సరఫరా చేస్తే కేవలం 3 లక్షల ప్యాకెట్లు మాత్రమే అమ్ముడయ్యాయన్నారు. మిగిలిన విత్తనాలను రైతులు కొనుగోలు చేయలేదన్నారు. మహికో విత్తనాలే కాకుండా మిగిలిన విత్తనాలతోనూ దిగుబడి బాగానే వస్తుందని రైతుల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతు సంఘాల నాయకులు రైతులకు విత్తనాలపై అవగాహన చేపడితే బావుంటుందని అన్నారు. విత్తనాల కొరత ఎక్కడా లేదనీ, కేవలం ఒక కంపెనీ బ్రాండు విత్తనాల కోసమే ఈ గందరగోళం నడుస్తోందని మంత్రి కన్నా చెప్పుకొచ్చారు.
సంబంధిత సమాచారం
Feedback Print