జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » ముక్కులో చపాతి : బేబీకేర్ సెంటర్‌లో చిన్నారి మృతి! (Chapati | Nose | Baby Care Center | Hyderabad | lb Nagar)
హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లోని లక్ష్మీ బేబీకేర్ సెంటర్‌లో ఇది జరిగింది. ఈ బేబీ కేర్ సెంటర్‌లో రెండేళ్ళ చిన్నారి అన్వితను సంరక్షణ నిమిత్తం ప్రతి రోజూ వదిలిపెట్టి వెళ్లేవారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో.. బేబీ సంరక్షణ నిమిత్తం ఈ కేర్ సెంటర్‌లో చేర్చారు.

అయితే, బేబీ కేర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి చపాతీ తింటుండగా గొంతులో నుంచి ముక్కులోకి వచ్చింది. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్న చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.

అయితే పాప అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న అన్విత తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. బేబీ కేర్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంబంధిత సమాచారం
Feedback Print