జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » పనిచేయని ఐఎఎస్‌ల గురించే మాట్లాడా!: టీజీ వెంకటేష్ (Tg Venkatesh | ias Officers | Congress | Minister)
TG
FILE
ఐఎఎస్ అధికారులపై చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. పనిచేయని ఐఎఎస్ అధికారుల గురించే మాట్లాడానని టీజీ ఆదివారం స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల్లో ఉన్న ఉద్దేశ్యాన్ని గమనించండని టీజీ వ్యాఖ్యానించారు. పనిచేయకుండా జీతాలు తీసుకునేవారిపై వ్యాఖ్యానిస్తే తప్పేమిటని టీజీ ప్రశ్నించారు.

గడ్డం పట్టుకుని అడుగుతున్నాం. వాళ్లు పిలిచినప్పుడే వారి ఛాంబర్‌కు వెళ్తున్నాం. అయినా స్పందించడంలేదని ఐఎఎస్ అధికారుల తీరుపై టీజీ మండిపడ్డారు. ఐఎఎస్ అధికారులు తప్పులు సరిదిద్దుకుంటామంటే.. క్షమాపణ చెప్పేందుకైనా సిద్ధమని టీజీ వెల్లడించారు.

కాగా కొంతమంది ఐఏఎస్ అధికారులు పనిచేయకుండా కుర్చీలకే అతుక్కుపోతున్నారని టిజి వెంకటేష్ మండిపడ్డారు. పనిచేయని రాజకీయ నాయకులు, అధికారులను నడి రోడ్డుపై నిలబెట్టి కాల్చినా పాపం లేదంటానని టీజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం
Feedback Print