జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » చంచల్‌గూడ జైలులోనే రూ.100 కోట్లకు గాలి బెయిల్ డీల్!! (Chanchalguda Jail | Gali Janardhan Reddy | Bail Deal | Rs.100 Crores)
File
FILE
చంచల్‌గూడా జైలు ఆవరణలోనే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్‌కు డీల్ కుదిరిందని ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న దశరథరామిరెడ్డి నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్టు సమాచారం. గాలి బెయిల్ డీల్ ఒప్పందంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న దశరథరామిరెడ్డిని ఏసీబీ అధికారులు తిరుపతిలో ఆదివారం అరెస్టు హైదరాబాద్‌కు తరలించిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత ఆయన వద్ద ఏసీబీ నేరాంగీకార పత్రాన్ని సేకరించింది. ఇందులో ఆసక్తికరమై అంశాలు వెలుగు చూశాయి. గాలి జనార్ధన్ రెడ్డికి సమీప దగ్గరి బంధువైన ఈయన.. జైల్లో ములాఖత్ సమయంలో గాలికి బెయిల్ ఒప్పందం కుదిర్చినట్టు వెల్లడించారు.

ఈ డీల్‌లో భాగంగా తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఉన్న నాగమారుతి శర్మను సంప్రదించగా, ఆయన తిరస్కరించారని తెలిపారు. ఆ తర్వాత ఏసీబీ అరెస్టు చేసిన లక్ష్మి నరసింహారావుతో ఒప్పందం కుదుర్చుకోగా, గాలికి బెయిల్ ఇచ్చేందుకు వంద కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు దశరథరామిరెడ్డి వెల్లడించారు.

అయితే, వంద కోట్ల రూపాయలను తరలించే అంశంపై మల్లగుల్లాలు పడినట్టు చెప్పారు. ఇంత భారీ మొత్తంలో ఒకేసారి తరలించడం కష్టతరంగా గాలి సోదరులు, అనుచరులు భావించినట్టు వాంగ్మూల పత్రంలో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో జడ్జి నాగమారుతీశర్మను నాలుగో సాక్షిగా ఏసీబీ చేసింది.
సంబంధిత సమాచారం
Feedback Print