జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » జగన్‌కు సీఎం కిరణ్‌కు స్నేహబంధం : రాఘవులు ఆరోపణ (Jagan | Kiran | bv Raghavulu | ysr Congress)
raghavulu
File
FILE
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య స్నేహబంధం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. అక్రమాస్తుల కేసు నుంచి జగన్‌ను రక్షించేందుకే ఈ బంధం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఇందులోభాగంగానే సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ జగన్‌కు లబ్ధి చేకూర్చేలా 26 జీవోలు విడుదల చేసిన మంత్రులకు న్యాయ సహాయం అందించడమంటే జగన్‌ను రక్షించే ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే జగన్‌తో స్నేహం కుదిరిందా? లేక చర్యలు చేపట్టడంలో కాళ్లు చాపేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు.

మంత్రి పార్థసారథి నేరస్తుడిగా రుజువైనప్పటికీ రాజీనామా చేయక పోవడం శోచనీయమన్నారు. పైపెచ్చు.. ఆయనను తన మంత్రివర్గంలో కొనసాగేలా సీఎం అనుమతి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2011 జనాభా ప్రాతిపదికన నిర్వహిస్తామని పదేపదే చెబుతున్న సీఎం ఆ దిశగా చేసిందేమిటని రాఘవులు ప్రశ్నించారు. ప్రజా సమస్యల పోరాటంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.
సంబంధిత సమాచారం
Feedback Print