ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » బాణాసంచా వల్లే ఎస్-11 బోగీలో మంటలు : ఫోరెన్సిక్ (Tamilnadu Express | Forensic Team | Nellore)
బాణాసంచా వల్లే ఎస్-11 బోగీలో మంటలు : ఫోరెన్సిక్
ఆదివారం, 5 ఆగస్టు 2012( 13:50 IST )
File
FILE
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై మూడు రోజుల పాటు దర్యాప్తు సాగించిన ఫోరెన్సిక్ బృందం తన నివేదికను రైల్వే శాఖ ఉన్నతాధికారులకు సమర్పించింది. ఇందులో రైలులో అధిక మోతాదులో బాణాసంచా పేలడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు దర్యాప్తులో తేలినట్టు నివేదికలో పేర్కొంది.
బాణాసంచా ఒక ప్రయాణికుడితో ఉండటం వల్లే నెల్లూరు రైలు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్-11 బోగిలో సీటు నంబరు 52, 53 సీట్లలో బాణాసంచా ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, దీనికి సంబంధించి మరింత స్పష్టంగా శోధించాల్సి ఉందని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
కాగా, ఇటీవల నెల్లూరులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న పేలుడులో 32 మంది వరకు మృత్యువాత పడగా, మరికొంతమంది గాయపడిన విషయం తెల్సిందే.