జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » ఏపీ న్యూస్ » సమైఖ్యాంధ్రలో ముఖ్యమంత్రి పదవి వద్దనే వద్దు : శ్రీనివాస్ (United Andhra | cm Post | Srinivas Goud | Telangana | Swamy Goud)
File
FILE
సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్క రాజకీయ నేత కూడా చేపట్టరాదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం సోమాజిగూడలోని జయా గార్డెన్‌లో జరిగిన స్వామిగౌడ్ అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమం కొనసాగించాలన్నారు. ఈ విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని మాత్రం యధావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు.

కాగా, ఈ సభలోనే పాల్గొన్న మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. మంత్రి జానారెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు టీఎన్‌జీవో నేతలు అడ్డుకోబోయారు. అభినందన సభలో అభ్యంతరాలు తెలుపవద్దని మంత్రి వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ.. టీఎన్‌జీవోలు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ ఉద్యమసమయంలో తెలంగాణ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేసేందుకు మావంతు కృషి చేస్తునే ఉన్నామని మంత్రి వారికి చెప్పారు. ఉద్యమంలో ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని పొగిడారు. మేం ఏస్థాయిలో ఆస్థాయిలో తెలంగాణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామన్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print